Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలా లేకపోతే... ట్రేడింగ్‌కు ఫుల్‌స్టాప్... చైనా కంపెనీలకు అమెరికా స్పష్టీకరణ...

వాషింగ్టన్ : అమెరికా-చైనా ప్రచ్ఛన్న యుద్ధం మరింతగా ముదురుతోందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. అమెరికా స్టాక్‌ ఎక్స్చేంజీల్లో నమోదైన చైనా కంపెనీల ఆడిటింగ్‌, యూఎస్‌ పబ్లిక్‌ కంపెనీల అకౌంటింగ్‌ ఓవర్‌సైట్‌ బోర్డు పర్యవేక్షణ, ప్రమాణాలకణగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో... ఆయా కంపెనీల షేర్లకు అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేస్తామని స్పష్టం చేసింది.  అంతేకాదు... ఆ కంపెనీలు అసలు ప్రభుత్వ కంపెనీలేనా ? లేదంటే ప్రభుత్వానికి ఏమైనా వాటాలు మాత్రమే ఉన్నాయా ?  తదితర వివరాలను వార్షిక నివేదికల్లో స్పష్టం చేయాలని హుకూం జారీ చేసింది. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌(ఎస్‌ఈసీ) నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో... ఇక మీదట అమెరికా నుంచి చైనా కంపెనీలు నిధులు సేకరించడమన్నది  ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యూపడబోదని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. కాగా... ఈ పరిణామాల నేపధ్యంలో... చైనా రైడ్‌ హెయిలింగ్‌ సర్వీస్‌ కంపెనీ ‘దీదీ గ్లోబల్‌ ఇంక్‌’ న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజీకి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించింది. అంతేకాదు... ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయనున్నట్టు  ప్రకటించింది కూడా. 

Advertisement
Advertisement