ఎమ్మెల్యే తమ్ముడు చెబితేనే.. టైపిస్టు విధుల్లోకి?

ABN , First Publish Date - 2022-07-03T08:55:00+05:30 IST

ఎమ్మెల్యే తమ్ముడు చెబితేనే.. టైపిస్టు విధుల్లోకి?

ఎమ్మెల్యే తమ్ముడు చెబితేనే.. టైపిస్టు విధుల్లోకి?

రెండు రోజులుగా ఎంపీడీవో చుట్టూ తిరుగుతున్న కౌసర్‌ బేగం

ఆయన చెబితేనే చేర్చుకుంటానంటున్న ఎంపీడీవో

ఉద్యోగుల బదిలీల్లో వైసీపీ నేతల పెత్తనం


పరిగి, జూలై 2: పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ సోదరుడు రవీంద్ర ఉద్యోగుల బదిలీల్లో చక్రం తిప్పుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పంచాయతీ కార్యాలయంలో టైపిస్టుగా పనిచేస్తున్న కౌసర్‌ బేగం.. సాధారణ బదిలీల్లో భాగంగా పరిగి ఎంపీడీవో కార్యాలయానికి బదిలీ అయ్యారు. శుక్రవారం పోస్టింగ్‌ ఆర్డర్స్‌తో వచ్చిన ఆమెను విధుల్లో చేర్చుకునేందుకు ఎంపీడీవో శ్రీలక్ష్మి నిరాకరించారు. రవీంద్ర చెబితేనే విధుల్లో చేర్చుకుంటానని తేల్చి చెప్పారు. మళ్లీ శనివారం బిడ్డలతో కలిసి ఆఫీ్‌సకు వచ్చినా అదే మాట చెప్పడంతో కౌసర్‌ నిరాశగా వెనుదిరిగారు. కౌసర్‌ భర్త మున్నా వైసీపీలో సోషల్‌ మీడియాలో పనిచేశారు. ఆయనకు రవీంద్రతో విభేదాలు తలెత్తడంవల్లే ఆమెను విధుల్లో చేర్చుకోలేదని తెలుస్తోంది. ఎంపీడీవోను వివరణ కోరగా, తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-03T08:55:00+05:30 IST