ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సీఈవో వేతనంలో 30 శాతం కోత!

ABN , First Publish Date - 2020-05-25T21:23:54+05:30 IST

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు సీఈవో వి.వైద్యనాథన్ సహా బ్యాంకు సీనియర్ మేనేజ్‌మెంట్ వేతనంలో కోతలకు

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సీఈవో వేతనంలో 30 శాతం కోత!

ముంబై: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు సీఈవో వి.వైద్యనాథన్ సహా బ్యాంకు సీనియర్ మేనేజ్‌మెంట్ వేతనంలో కోతలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. 2021 ఆర్థిక సంవత్సరానికి సీనియర్ మేనేజ్‌మెంట్ తమ వేతనంలో 10 శాతం కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని, సీఈవో వైద్యనాథన్ వేతనంలో 30 శాతం వదులుకునేందుకు ముందుకు వచ్చినట్టు బ్యాంకు ప్రకటించింది. కాగా, ఉద్యోగుల ఒక రోజు వేతన మొత్తం రూ. 3.29 కోట్లను పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వగా, బ్యాంకు రూ. 5 కోట్లు ఇచ్చినట్టు పేర్కొంది. సీఈవో వైద్యనాథన్ వ్యక్తిగతంగా రూ. 47 కోట్లను కోవిడ్-19 సహాయ కార్యక్రమాలకు అందించారని, అందులో రూ. 25 లక్షలు పీఎం కేర్స్ ఫండ్‌కు, రూ. 5 లక్షలు సీఎం సహాయ నిధికి అందించినట్టు బ్యాంకు తెలిపింది. కాగా, కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా వేతనాల్లో 10 శాతం కోత విధించాలని నిర్ణయించింది. కోటక్ మహీంద్రా బ్యాంకు పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 25 కోట్ల విరాళం ఇవ్వగా, బ్యాంకు ఎండీ ఉదయ్ కోటక్ మరో రూ. 25 కోట్లు పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందించారు. 


Updated Date - 2020-05-25T21:23:54+05:30 IST