ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.4,747 కోట్లు

ABN , First Publish Date - 2021-07-25T06:19:29+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.4,747 కోట్లు

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గాను బ్యాం క్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఏకంగా 52 శాతం వృద్ధితో రూ.4,747.42 కోట్లుగా నమోదైంది. స్టాండ్‌ ఎలోన్‌ ప్రాతిపదికన నికర లాభం రూ.4,616.02 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే నికర లాభం 77 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.26,067 కోట్ల నుంచి రూ.24,379 కోట్లకు తగ్గింది.  

Updated Date - 2021-07-25T06:19:29+05:30 IST