లిఫ్ట్ ఇచ్చిన మహిళకు కానిస్టేబుల్ వేధింపులు

ABN , First Publish Date - 2020-07-12T23:11:10+05:30 IST

లిఫ్ట్ ఇచ్చిన మహిళకు కానిస్టేబుల్ వేధింపులు

లిఫ్ట్ ఇచ్చిన మహిళకు కానిస్టేబుల్ వేధింపులు

హైదరాబాద్‌: కారులో లిఫ్టు ఇచ్చిన ఓ మహిళను కానిస్టేబుల్‌ వేధించాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీనగర్‌ కాలనీలో కారులో వెళ్తున్న ఓ మహిళను కానిస్టేబుల్‌ వీరబాబు తనను సీఎం క్యాంపు ఆఫీస్‌ వరకు డ్రాప్‌ చేయాలని లిఫ్టు అడిగాడు. వెంటనే ఆ మహిళ వీరబాబుకు లిప్టు ఇచ్చింది.. ఆమెతో మాటలు కలిపిన కానిస్టేబుల్ ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు‌. ఫోన్ నెంబర్ ఇచ్చిన మరుసటి రోజు నుంచి కానిస్టేబుల్‌ మహిళకు ఫోన్లు చేయడం, వాట్సాప్‌లో మెసేజ్ లు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడు.తీవ్ర వేధింపులకు గురైన ఆ మహిళ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ వీరబాబుపై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-07-12T23:11:10+05:30 IST