HYD: స్టీల్ ప్యాలెస్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-01-18T14:43:04+05:30 IST

నగరంలోని హుమాయునగర్ ఎన్‌ఎమ్‌డీసీ మెయిన్ రోడ్‌లో గల మహాలక్ష్మీ స్టీల్ ప్యాలెస్‌‌లో అగ్నిప్రమాదం జరిగింది.

HYD:  స్టీల్ ప్యాలెస్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని హుమాయునగర్ ఎన్‌ఎమ్‌డీసీ మెయిన్ రోడ్‌లో గల మహాలక్ష్మీ స్టీల్ ప్యాలెస్‌‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున దుకాణంలో నుంచి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ఆస్తినష్టం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-18T14:43:04+05:30 IST