హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం

ABN , First Publish Date - 2020-08-05T02:37:12+05:30 IST

నగరంలో రేపు (బుధవారం) పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. రేపు ఉదయం 6 గంటల నుండి గురువారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు మంచినీటి

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్: నగరంలో రేపు (బుధవారం) పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. రేపు ఉదయం 6 గంటల నుండి గురువారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా సంస్థ ప్రకటన విడుదల చేసింది. కావున వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఇవే.. షేక్‌పేట్, టోలిచౌకి, ప్రశాసానగర్, జూబ్లీ హిల్స్, తట్టిఖాన, మాదా పూర్, గచ్చిబౌలి, గోల్డెన్ హైట్స్, హైదర్‌గుడ, అత్తాపూర్ రిజర్వాయర్ ప్రాంతాలు.

Updated Date - 2020-08-05T02:37:12+05:30 IST