Telangana ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైన వీఆర్వోలు.. ఈ నెల 25 నుంచి పోరాటం

ABN , First Publish Date - 2022-07-10T00:17:17+05:30 IST

తెలంగాణ (Telangana)లో వీఆర్వో (VRO)లు పోరుబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కారంకోసం సమ్మెకు సమాయత్తమవుతున్నారు. వీఆర్వో వ్యవస్థ..

Telangana ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైన వీఆర్వోలు.. ఈ నెల 25 నుంచి పోరాటం

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana)లో వీఆర్వో (VRO)లు పోరుబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కారంకోసం సమ్మెకు సమాయత్తమవుతున్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దు అయి రెండేళ్లు కావస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు దూరంగా ఉండాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల జేఏసీ నిర్ణయించింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేస్తామని ప్రకటించింది.


ఇక హైదరాబాద్‎లో సమావేశమైన వీఆర్వో సంఘాల నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. డిమాండ్ల సాధన కోసం జేఏసీ (Jac)గా ఏర్పడ్డారు. వీఆర్వో వ్యవస్థ రద్దు చేసి 22 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. విధి నిర్వహణలో చనిపోయిన దాదాపు 200 మంది వీఆర్వో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం అమానుషమని మండిపడ్డారు.


అసెంబ్లీ (Assembly)లో ప్రకటించిన విధంగా పేస్కేలు అమలు, వారసులకు ఉద్యోగాలు, పదోన్నతలు కల్పించేందుకు జీవో జారీ చేయాలని వీఆర్వో నేతలు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ మేరకు సమ్మె నోటీస్ అందజేశారు. 



Updated Date - 2022-07-10T00:17:17+05:30 IST