అంతర్ రాష్ట్ర పాత నేరస్తుడి అరెస్ట్

ABN , First Publish Date - 2020-04-10T19:17:30+05:30 IST

హైదరాబాద్: రాత్రి సమయాల్లో కారులో వెళ్లి తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పొలకి అప్పల నాయుడు ..

అంతర్ రాష్ట్ర పాత నేరస్తుడి అరెస్ట్

హైదరాబాద్: రాత్రి సమయాల్లో కారులో వెళ్లి తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పొలకి అప్పల నాయుడు అనే అంతర్ రాష్ట్ర పాత నేరస్తుడిని నేడు మీర్‌పేట పోలీసులు  అరెస్ట్ చేశారు. నిందితుడిపై 2019 నుంచి ఇప్పటి వరకు 25 కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 40 లక్షల విలువైన 725 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 లక్షల నగదు,  2 ఎల్ఈడీ టీవీలు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు రాచకొండ సీపీ తెలిపారు.


Updated Date - 2020-04-10T19:17:30+05:30 IST