Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 28 2021 @ 09:14AM

Hyderabad: హుస్సేన్‎సా‎గర్‎లోకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్‌: నగరంలోని ఎన్టీఆర్ పార్క్‌ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి కారు హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కారును బయటికి తీశారు. బాధితులు ఖైరతాబాద్‌కు చెందిన నితిన్, సాత్విక్, కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
Advertisement