Abn logo
Nov 26 2021 @ 11:28AM

సాయి నాగార్జునను అరెస్ట్ చేశారా..? కిడ్నాప్ చేశారా..?: టీడీపీ

హైదరాబాద్: మంత్రి కొడాలి నాని నివాసం దగ్గర నిరసన తెలిపిన తెలంగాణ తెలుగు యువత నాయకుడు సాయి నాగార్జునను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తమ గుర్తింపు కార్డులు చూపించకుండా సాయి నాగార్జునను తీసుకువెళ్లడంతో కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు భావించారు. ధీనిపై ఏబీఎన్ కూడా ప్రసారం చేయడంతో విషయం తెలుసుకున్న మాదాపూర్ డీసీపీ వివరాలను వెల్లడించారు. సాయి నాగార్జునపై ఎఫ్ఐఆర్ నమోదైందని, రాయదుర్గం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కొడాలి నాని ఇంటి ముందు నిరసన కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నరన్నదానిపై విచారణ జరిపిన అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి.. సాయి నాగార్జునను విడిచిపెడతామని రాయదుర్గం పోలీసులు చెప్పారు.