Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 27 2021 @ 08:33AM

Hyderabad: ఆ తేదీల్లో తాగునీరు బంద్‌

హైదరాబాద్‌ సిటీ: ఈ నెల 29, 30 తేదీల్లో నగరానికి మంజీరా నీళ్లు నిలిచిపోనున్నాయి. మంజీరా ఫేజ్‌-2 పరిధిలోకి వచ్చే పటాన్‌చెరు నుంచి హైదర్‌నగర్‌ వరకు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది. మెయిన్‌ పైప్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీలతో నీళ్లు వృథాగా పోతున్నాయి. వాటి నివారణకు పైపులైను మరమ్మతులు, కంది గ్రామం వద్ద జంక్షన్‌ పనులు ఈ నెల 29, 30 తేదీల్లో చేపట్టాలని వాటర్‌బోర్డు అధికారులు నిర్ణయించారు. దీంతో 29న ఉదయం 6 నుంచి 30న సాయంత్రం 6 వరకు సుమారు 36 గంటల పాటు నగరానికి మంజీరా సరఫరా నిలిచిపోనుంది. ప్రధానంగా నగరంలోని హైదర్‌నగర్‌, రాంనరే్‌షనగర్‌, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్‌, వసంత్‌ నగర్‌, ఎస్‌పీనగర్‌, మియాపూర్‌, దీప్తిశ్రీ నగర్‌, శ్రీనగర్‌, మాతృశ్రీనగర్‌, లక్ష్మీనగర్‌, జేపీనగర్‌, చందానగర్‌, నిజాంపేట్‌, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్‌, బొల్లారం తదితర ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుందని అధికారులు సూచించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement