టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల..

ABN , First Publish Date - 2021-10-17T16:54:54+05:30 IST

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు ఆదివారం ఉదయం షెడ్యూల్ విడుదలైంది.

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల..

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు ఆదివారం ఉదయం షెడ్యూల్ విడుదలైంది. రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేశారు. నేటి నుంచి ఈనెల 22 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఈనెల 23న స్క్రూటినీ, 24న నామినేషన్ల ఉపసంహరణ, 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.


కాగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే ఈనెల 25న జరగనున్న ప్లీనరీపై కూడా చర్చించనున్నట్లు తెలియవచ్చింది. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం వ్యూహాలు ఖరారు చేయనున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశముంది. కాగా పార్టీ అధ్యక్ష ఎన్నికకు ఈరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. సోమవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ తరపున.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నామినేషన్లు వేయనున్నారు.  ప్రతీ నాలుగేళ్లకోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. 

Updated Date - 2021-10-17T16:54:54+05:30 IST