మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2022-03-03T18:32:26+05:30 IST

మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చేనేత మిత్ర సబ్సిడీ 6 నెలలుగా రాకపోవటంపై లేఖలో పేర్కొన్నారు. చేనేత,  అనుబంధ కార్మికులకు చేనేత మిత్ర పథకం కింద రావాల్సిన 40% సబ్సిడీ 6 నెలలు దాటినా రావటం లేదని, దీంతో చేనేత కార్మికులు ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ లేఖలో తెలిపారు.


కోమటిరెడ్డి మాట్లాడుతూ... చేనేత మిత్ర పథకం ద్వారా కార్మికులు పట్టు నూలు కొనుగోలు చేశారన్నారు. 2 నెలలకు ఒక్కసారి అందవాల్సిన సబ్సిడీ 6 నెలలు అయిన అందటం లేదని అన్నారు. పట్టు కొనుగోలు చేసి 6 నెలలు గడిచినా వారికి అందవాల్సిన 40% సబ్సిడీ రావడం లేదని ఎంపీ తెలిపారు. పట్టు నూలు కేజీ 6 వేలకు పెరగడంతో మాస్టర్ కార్మికులకు పని కలిపోయించలేక మగ్గాలు బంద్ చేశారన్నారు. పనిలేక చేనేత కార్మికుల ఇల్లు గడవడం గగనం అయ్యిందని అన్నారు. కార్మికులు పట్టునూలు కేజీ 6వేలకు కొనుగోలు చేస్తుంటే... సబ్సిడీ మాత్రం ప్రభుత్వం రూ.4700 రూపాయలకు మాత్రమే ఇస్తుందన్నారు. త్వరలో ఈ సమస్య ని పరిష్కరించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-03T18:32:26+05:30 IST