హైదరాబాద్: కొత్త జిల్లాలకు టీచర్లల కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జీవో 317పై స్టే ఇచ్చేందుకు మరోసారి హైకోర్టు నిరాకరించింది. కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు విధుల్లో చేరారంటూ అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు. పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అలాగే తుది తీర్పునకు లోబడి కేటాయింపులు ఉండాలని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఏప్రిల్ 4కి కోర్టు వాయిదా వేసింది.