సమాజ నిర్మాణానికి పుస్తకమే సాధనం

ABN , First Publish Date - 2022-08-17T20:56:52+05:30 IST

చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి పుస్తకమే ప్రధాన సాధనమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌(Minister Srinivas Goud) అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌

సమాజ నిర్మాణానికి పుస్తకమే సాధనం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి పుస్తకమే ప్రధాన సాధనమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌(Minister Srinivas Goud) అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌(Hyderabad Book Fair) ఆధ్వర్యంలో  ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ పుస్తక ప్రదర్శనను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బాపూజీపై వెలువడిన సుమారు వెయ్యి పుస్తకాలు ప్రదర్శనలో ఉండటం గొప్ప విషయమని అన్నారు. మహాత్ముని ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పుస్తక ప్రదర్శన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 22వరకు సాగే ఈ ప్రదర్శనను పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ కే.కేశవరావు కూడా పుస్తక ప్రదర్శనను సందర్శించారు.

Updated Date - 2022-08-17T20:56:52+05:30 IST