హైదరాబాద్: చిన్నారిని తాను దత్తత తీసుకోలేదని సినీ నటి కరాటే కల్యాణి (Actress Karate Kalyani) అన్నారు. దత్తత వ్యవహారంపై కలెక్టర్కు వివరణ ఇచ్చానని కరాటే కల్యాణి పేర్కొన్నారు. CWC అధికారులు లేకపోవడంతో బుధవారం విచారణకు రమ్మన్నారని ఆమె తెలిపారు. పాపను దత్తత తీసుకున్నట్లు శివశక్తి సంస్థ కావాలనే ప్రచారం చేసిందని కల్యాణి ఆరోపించారు. తాను దత్తత తీసుకున్నట్లు ఓ ఛానెల్లో మాట్లాడింది నిజమే అని కల్యాణి చెప్పారు. తనను చూసి ఇన్స్పైర్ అవుతారనే అలా చెప్పానని కరాటే కల్యాణి వెల్లడించారు. కావాలనే తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కల్యాణి మండిపడ్డారు. CWC విచారణకు కరాటే కల్యాణి, దత్తత తీసుకున్న చిన్నారితో పాటు తల్లిదండ్రులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి