LIVE: తెలంగాణ సర్కార్‌పై ప్రతిపక్షాల ఆగ్రహం

ABN , First Publish Date - 2020-08-11T13:19:59+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఇక్కడున్న ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా

LIVE: తెలంగాణ సర్కార్‌పై ప్రతిపక్షాల ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఇక్కడున్న ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కావాలనే తెలంగాణ రాష్ట్ర సర్కార్ దాగుడు మూతలకు పాల్పడుతోంది. ఏపీ ప్రయోజనాలకు లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది అనేది ప్రధానంగా తెలంగాణలోని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు. దానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం... తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని... అపెక్స్ కౌన్సిల్‌లో ఏపీ ప్రభుత్వ తీరును ఎండగడతామని... ఏపీతో పాటు కేంద్రం కూడా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని నిన్న సీఎం కేసీఆర్ తెలిపారు.


ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అండస్ట్రాండింగ్ ఉందని రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ...అపెక్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదులు చేసుకున్నాయి...ఈనెల 20న అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా జరుగబోతోంది. అయితే ఎందుకు ఇక్కుడున్న ప్రతిపక్షాలు... తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్న చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... ఎందుకు వారికి అనుమానాలు ఉన్నాయి అనే దానిపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ చేపట్టారు. ఈ చర్చలో సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం అసోసియేషన్ నేత సత్తిరెడ్డి, బీజేపీ నేత పాల్వాయి రజినీకుమారి, కాంగ్రెస్ నేత సంపత్ పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.  

Updated Date - 2020-08-11T13:19:59+05:30 IST