హైదరాబాద్లో అర్ధరాత్రి దొంగల బీభత్సం
ABN , First Publish Date - 2021-05-16T13:39:16+05:30 IST
నగరంలోని కులుసుంపుర అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. జియాగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలో వరుసగా ఐదు ఇళ్లలో చోరీకి
హైదరాబాద్: నగరంలోని కులుసుంపురలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. జియాగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలో వరుసగా ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. కరోనా వల్ల ఇంటికి తాళం వేసి సొంత ఊళ్లకు వెళ్లిన ఇండ్లనే దుండగులు టార్గెట్గా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్వర కాలనీలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.