Abn logo
Mar 27 2020 @ 01:14AM

ఇటలీలో చిక్కుకున్న హైదరాబాద్ స్టూడెంట్.. చస్తే ఇండియాలోనే..

హైదరాబాద్: ఇటలీలో కరోనా మహమ్మారి కారణంగా గంటల వ్యవధిలోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అక్కడున్న ఇతర దేశస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. స్వదేశాలకు తీసుకెళ్లమంటూ తమ దేశానికి చెందిన విదేశాంగ శాఖకు మొర పెట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన అఖిల్ అనే విద్యార్థి తమను ఇండియాకు తీసుకొచ్చేందుకు సహాయం చేయాలంటూ ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్‌ను వేడుకున్నాడు. ‘ఇటలీలో ఉన్న భారతీయులందరి తరపున నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడున్న భారతీయులందరూ భారత్‌కు రావాలని ఎదురుచూస్తున్నారు. ఇటలీలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. అంతర్జాతీయులు వివక్షకు గురవుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జయశంకర్ మాకు సాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ మేము చనిపోయినా.. భారత్ వచ్చే చనిపోతాం. ఇటలీలో చావాలని మాకు లేదు’ అని తన ఆవేదనను వీడియోలో వ్యక్తం చేశాడు. కాగా.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement