కేసీఆర్‌కు శాస్తి తప్పదు : ఈటల

ABN , First Publish Date - 2022-02-25T07:20:12+05:30 IST

రాజ్యాంగంపై మాట్లాడిన సీఎం కేసీఆర్‌కు రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో తగిన శాస్తి తప్పదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

కేసీఆర్‌కు శాస్తి తప్పదు : ఈటల

హైదరాబాద్‌, హనుమకొండ రూరల్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగంపై మాట్లాడిన సీఎం కేసీఆర్‌కు రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో తగిన శాస్తి తప్పదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం హనుమకొండలో మేధావులు, వివిధ కుల సంఘాల నాయకులతో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్‌ మార్చలనడం బాధాకరమన్నారు. అధికారంలోకి రాకముందు అవసరమైన రాజ్యాంగం.. నేడు అవసరం లేకుండా పోయిందా? అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.


దేశంలో బీజేపీ పాలనలో ఉన్న ఏ రాష్ట్రంలో మత కలహాలు జరిగాయో, ఎక్కడ అభివృద్ధి ఆగిపోయిందో వెల్లడించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి.. సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే మత కలహాలు వస్తాయంటూ చేసిన వ్యాఖ్య ఉద్దేశమేంటని నిలదీశారు. బట్టకాల్చి మీద పడేసి శాడిస్టులా ఆనందించడం కేసీఆర్‌కు ఇష్టమైన పని అని నేడొక ప్రకటనలో విమర్శించారు. 

Updated Date - 2022-02-25T07:20:12+05:30 IST