కొనసాగుతున్న Huzurabad ఉప ఎన్నిక..

ABN , First Publish Date - 2021-10-30T12:43:07+05:30 IST

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కీలక ఘట్టానికి చేరుకుంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. అధికారులు ఇప్పటికే పోలింగ్‎కు అన్ని సర్వసన్నద్ధం

కొనసాగుతున్న Huzurabad ఉప ఎన్నిక..

హుజురాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కీలక ఘట్టానికి చేరుకుంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. అధికారులు ఇప్పటికే పోలింగ్‎కు అన్ని సర్వసన్నద్ధం చేశారు. అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేడు జరగనున్న పోలింగ్‎తో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తెల్చనున్నారు. ప్రతి ఓటరు విధిగా మాస్కును ధరించడంతోపాటు కొవిడ్‌ నిబంధనల్ని పాటించాలని అధికారులు ఓటర్లకు సూచించారు. 


హుజురాబాద్‎లో మొత్తం ఓటర్లు రెండు లక్షల 37 వేల మంది ఉండగా 36 మంది ఉన్నారు. ఐదు మండలాల్లో 306 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికకు 421 కంట్రోల్ యూనిట్స్, 891 బ్యాలెట్ యూనిట్స్ ను అధికారులు సిద్ధం చేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత కోవిడ్ పేషంట్స్‎కి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. కాగా, ఎన్నికలు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు వెబ్‌కాస్టింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ కోసం జిల్లా పోలీస్‌ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.


పోలింగ్ బూత్‎ల్లో గందరగోళం ఏర్పడింది. 

హుజురాబాద్ బూతుల్లో 30 మందికి సరిపడా రెండు ఈవీఎంలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే.. మొదటి ఈవీఎం పెట్టాల్సిన స్థానంలో రెండవ ఈవీఎంను పెట్టారు. దీంతో బూత్ లో గందరగోళం నెలకొంది. ఓటు వేయడానికి వచ్చిన ఓట్లరు అయోమయానికి గురై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-30T12:43:07+05:30 IST