ఏసీసీ (మంచిర్యాల), జనవరి 21: ఆరు దశాబ్దాలకు పైగా పెనవేసుకుపోయిన బంధం వారిది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే..! చివరకు మరణంలోనూ..! తనను విడిచి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లని భార్య.. ఒక్కసారిగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయే సరికి ఆ వృద్ధుడు తట్టుకోలేకపోయాడు. భార్య లేని లోకంలో ఉండలేనని భావించి.. తనూ ఆమెతోటే వెళ్లిపోయాడు. గుండెను పిండేసే ఈ విషాద ఘటన.. గురువారం మంచిర్యాలలో జరిగింది. సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ పొందిన మేరుగు శాంతయ్య (85).. భార్య సుశీల (80)తో కలిసి మంచిర్యాల ఎడ్లవాడలో నివసిస్తున్నాడు. సుశీల అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందింది. దీంతో తీవ్రమైన మనోవేదనకు గురైన శాంతయ్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.