భార్యపై బెంగతో భర్త ఆత్మహత్య!
ABN , First Publish Date - 2020-04-11T20:31:38+05:30 IST
లాక్డౌన్ వలన భార్య దూరంగా ఉండిపోయిందన్న బెంగతో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో రాధాకుండ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
యూపీలో ఘటన
లఖ్నవూ: లాక్డౌన్ వలన భార్య దూరంగా ఉండిపోయిందన్న బెంగతో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో రాధాకుండ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాకేశ్ సోనీ(32) భార్య నెలరోజుల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ విధించడంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో భార్యపై బెంగ పెట్టుకున్న రాకేశ్, బుధవారం తన ఇంటిలో ఉరేసుకుని బలవన్మరణంపాలయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.