ఆకలి పున్నమి

ABN , First Publish Date - 2020-11-09T06:35:51+05:30 IST

కొన్ని కొండెక్కుతున్న దీపాలు కాంతికోసం ప్రశ్నల్ని చిందిస్తుంటాయి...

ఆకలి పున్నమి

కొన్ని కొండెక్కుతున్న దీపాలు

కాంతికోసం

ప్రశ్నల్ని చిందిస్తుంటాయి.


ఎదురుచూపులు

వంగినదేహానికి మళ్ళీ శక్తినిస్తాయి


కార్తీకమాసపు పూజకోసం

ఆడపిల్లలు సూర్యకిరణాల్లా

కొమ్మలచాటు పూలను వెతుకుతుంటారు.


దూదిగడ్డంతో

మిట్టమధ్యాహ్నం మిలమిలమంటుంది.


రైలు ప్రయాణపు దిగులుతో

కాటుకరాత్రి గాఢమవుతుంది.


చీకటి కంచం నిండా

వెలుతురు మెతుకుల

ఆకలి విరబూస్తుంది.


మొలకెత్తకుండానే

కూలిపోయిన విత్తనం

పంటను స్మరిస్తూ హరించుకుపోతుంది.


వేటకు వెళ్ళి

ఒంటరిగా తిరిగొచ్చిన ఖాళీపడవ

తీరాన్ని శోకంతో ముంచెత్తింది.


ర్యాలి ప్రసాద్‌

94945 53425

Updated Date - 2020-11-09T06:35:51+05:30 IST