ఐపీఎల్‌-2 ఆడకుంటే.. విదేశీ క్రికెటర్లకు భారీ నష్టం

ABN , First Publish Date - 2021-06-03T06:21:06+05:30 IST

యూఏఈలో జరిగే 2021 ఐపీఎల్‌-2లో పాల్గొనని విదేశీ క్రికెటర్లు భారీగా నష్టపోనున్నారు. సెప్టెంబరులో లీగ్‌ను నిర్వహించాలని

ఐపీఎల్‌-2 ఆడకుంటే.. విదేశీ క్రికెటర్లకు భారీ నష్టం

న్యూఢిల్లీ: యూఏఈలో జరిగే 2021 ఐపీఎల్‌-2లో పాల్గొనని విదేశీ క్రికెటర్లు భారీగా నష్టపోనున్నారు. సెప్టెంబరులో లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో జాతీయ జట్లకు ఆడాల్సి ఉండడంతో బెన్‌ స్టోక్స్‌, కమిన్స్‌లాంటి స్టార్లు ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే వారికి వేతనంలో సింహభాగం కోతపడనుంది. ఉదాహరణకు..కమిన్స్‌ను రికార్డు స్థాయిలో రూ. 15.5 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వేలంలో కొనుగోలు చేసింది. అతడు ఐపీఎల్‌-2లో ఆడకుంటే కేవలం రూ. 7.75 కోట్ల వేతనమే లభిస్తుంది. 


Updated Date - 2021-06-03T06:21:06+05:30 IST