హైదరాబాద్: ధరణి వెబ్‌సైట్‌లో భారీ మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నిషేధిత భూముల తొలగింపు, కొత్త మాడ్యూల్స్‌తో సమస్యలకు పరిష్కారం చూపనుంది. వ్యవసాయ భూమిలో ఇళ్లు నిర్మించుకుంటే రైతుబంధును నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలోకి లక్షల ఎకరాల భూములు వెళ్లాయి. ధరణిలో రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్న తరువాత డబ్బులను తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తమ భూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్‌ల చుట్టూ వేలాది మంది రైతులు తిరుగుతున్నారు. రైతుల విన్నపాలు సుమోటోగా తీసుకుని పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నారు. వారం రోజుల్లో ధరణి నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే అవకాశం ఉంది.