ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-07-03T08:20:33+05:30 IST

ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు

ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు

ఎస్పీజీ బృందాల నీడలో పెదఅమిరం

భీమవరం, కాళ్ళ, జూలై 2(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 4న  పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలో జరగనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా శనివారం మిలటరీ హెలికాఫ్టర్లు ట్రయల్‌ రన్‌ నిర్వహించాయి. పెదఅమిరంలోని నాలుగు హెలీప్యాడ్లను బాంబు స్క్వాడ్‌లు తనిఖీ చేశారు. హెలీప్యాడ్ల నుంచి సభా ప్రాంగణం వరకు, అక్కడి నుంచి భీమవరంలోని అల్లూరి విగ్రహావిష్కరణ స్థలికి వరకు ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రసంగించే వేదికను పది అడుగుల ఎత్తులో సుమారు 70 వేల మంది ప్రజలు కూర్చునేలా జర్మన్‌ సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వర్షం వచ్చినా సభకు ఇబ్బంది ఉండదు. ఎస్పీజీ బృందాలతోపాటు జిల్లా పోలీసులు భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Updated Date - 2022-07-03T08:20:33+05:30 IST