Abn logo
Jul 16 2020 @ 06:46AM

చికిత్స కోసం క్వారంటైన్ కేంద్రానికి వచ్చిన బాలికపై గార్డు అఘాయిత్యం

పట్నా (బీహార్): ఓ బాలిక చికిత్స చేయించుకునేందుకు కొవిడ్-19 క్వారంటైన్ కేంద్రానికి రాగా, అక్కడ ఉన్న గార్డు ఆమెపై అత్యాచారం జరిపిన దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని పట్నా నగరంలోని వైద్యకళాశాల కొవిడ్-19 క్వారంటైన్ కేంద్రంలో వెలుగుచూసింది. పట్నా మెడికల్ కళాశాల కొవిడ్ ఆసుపత్రిలో మహేష్ ప్రసాద్ గత మూడు నెలలుగా గార్డుగా పనిచేస్తున్నాడు.రాత్రివేళ ఓ బాలిక చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రికి రాగా అక్కడ గార్డు మహేష్ ప్రసాద్ ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. బాధిత బాలిక ఫిర్యాదు మేర పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు వైద్యపరీక్షలు చేయించామని, రెండు,మూడు రోజుల్లో వైద్యుల నివేదిక వస్తుందని బీహార్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ దిల్మనీ మిశ్రా చెప్పారు. నిందితుడైన గార్డును అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. 

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement
Advertisement