ప్రేమ పేరుతో వల.. ఆపై..

ABN , First Publish Date - 2021-08-12T20:31:33+05:30 IST

హైదరాబాద్: నగరంలో మరో హనీ ట్రాప్ కేసు వెలుగు చూసింది. కేరళ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళ.. యువకులను టార్గెట్ చేస్తూ వేధిస్తోంది. ఓ బాధితుడు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో విషయం బయటపడింది.

ప్రేమ పేరుతో వల.. ఆపై..

హైదరాబాద్: నగరంలో మరో హనీ ట్రాప్ కేసు వెలుగు చూసింది. కేరళ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళ.. యువకులను టార్గెట్ చేస్తూ వేధిస్తోంది. ఓ బాధితుడు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన నీతూ అలియాస్ మేరీ, హైదరాబాద్‌లో ఉంటోంది. యువకులను టార్గెట్ చేసి.. లైంగిక వాంఛ తీర్చుకున్నతర్వాత వేధిపుంలకు గురి చేస్తోందని పలువురు బాధితులు తెలిపారు. వాట్సప్ చాటింగ్, ఫొటోలతో బ్లాక్ మెయిల్‌కి పాల్పడుతోందని వాపోయారు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే, కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న తన కుమారుడిని ట్రాప్ చేసి.. తనతోనే ఉండాలని బెదిరింపులకు దిగుతోందని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. నీతు భర్తకు ఇవన్నీ తెలిసినా.. భార్యకు సహకరిస్తూ యువకులను వేధిస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. ఆమెపై పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఆ మహిళ చేతిలో మోసపోయిన ఓ బాధితుడు న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. స్పందించిన హెచ్ఆర్సీ.. నవంబర్ 10లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2021-08-12T20:31:33+05:30 IST