Abn logo
Jun 19 2021 @ 03:11AM

ఈ స్థలాలు మాకొద్దు

తాటిపర్తిలో ఇళ్ల పట్టాలు వెనక్కిచ్చేసిన లబ్ధిదారులు


గొల్లప్రోలు రూరల్‌, జూన్‌ 18: హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లు, గ్యాస్‌ పైప్‌లైన్‌ ఉన్న ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే గృహాలు ఎలా నిర్మించుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నించారు. పట్టాలను గ్రామసభలో వెనక్కిచ్చేసి నిరసన తెలిపారు.  తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో 167 మందికి 3.17 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. వాటిని అప్పగించేందుకు శుక్రవారం  సమావేశం ఏర్పాటు చేశారు.  స్థలా లు తమకు వద్దంటూ కొందరు పట్టాలను  అధికారులకు ఇచ్చి వెళ్లిపోగా మరికొందరు అక్కడే పడేసి వెళ్లిపోయారు.