Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 28 Jun 2022 11:41:45 IST

YCP కార్యకర్తల పిల్లలకే వలంటీర్ పోస్టులు... ఏపీ Home minister వివాదాస్పద వ్యాఖ్యలు

twitter-iconwatsapp-iconfb-icon
YCP కార్యకర్తల పిల్లలకే వలంటీర్ పోస్టులు... ఏపీ Home minister  వివాదాస్పద వ్యాఖ్యలు

తూర్పుగోదావరి:  రాష్ట్రంలోని వలంటీర్ పోస్టులపై హోంమంత్రి తానేటి వనిత (Taneti vanita) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిడదవోలులో జరుగుతున్న వైసీపీ (YCP) ప్లీనరీలో అసంతృప్తిగా ఉన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగించారు. వలంటీర్ పోస్టులను పార్టీ కార్యకర్తల పిల్లలకే ఇచ్చామని అన్నారు. కార్యకర్తలను పట్టించుకోలేదనడం అవాస్తవమని తెలిపారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లలోని పిల్లలకే వలంటీర్ పదవులు ఇవ్వడం వాస్తవం కాదా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్ల పదవులతో పాటు వలంటీర్ పోస్టులు కూడా కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చామని హోంమంత్రి తానేటి వనిత వెల్లడించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.