ఇది అన్నదాత చారిత్రక విజయం: హోం మంత్రి

ABN , First Publish Date - 2021-11-20T02:18:50+05:30 IST

రైతులు వ్యతిరేకిస్తున్న మూడు రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడం అన్నదాత విజయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు.

ఇది అన్నదాత చారిత్రక విజయం: హోం మంత్రి

హైదరాబాద్: రైతులు వ్యతిరేకిస్తున్న మూడు రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడం అన్నదాత విజయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. వందల మంది రైతులు కొన్ని నెలలుగా మొక్కవోని దృడ సంకల్పంతోచలికి వణుకుతూ, ఎండకు ఎండుతు, వానకు తడుస్తూ, ఆకలికి అలమటిస్తూ కేసులకు జంకకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన పోరాటానికి ఫలితమని హోం మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం ఒక ప్రకటన చేస్తూ ఈ ఉద్యమం నేపధ్యంలో ఎంతోమంది రైతులు ప్రాణాలను సైతం త్యాగం చేసారనీ,వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ అసువులు బాసిన రైతులకు నివాళులర్పించారు. 


అమరులైన రైతుల కుటుంబాలను ఆదుకునే భాద్యత కేంద్రం తీసుకోవాలనీ, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకు వచ్చిన  వెంటనే, కేసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు, రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృడ సంకల్పం, పట్టుదల, మొక్కవోని దీక్ష, దక్షత ఏంటో, తెలంగాణ సాధనలో కేసిఆర్ పాత్ర ఏంటో దేశం మొత్తానికి తెలుసున్నారు. కేసిఆర్ నాయకత్వంలో రైతులకు అండగా, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటానికి నాంది పలకడం కూడా అందరికీ తెలిసిందేననివివరించారు. 

Updated Date - 2021-11-20T02:18:50+05:30 IST