Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 21 Oct 2021 16:44:10 IST

ఇంటిని సరికొత్తగా మలచాలంటే ఇలా చేయండి!

twitter-iconwatsapp-iconfb-icon
ఇంటిని సరికొత్తగా మలచాలంటే ఇలా చేయండి!

ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. మనం ఎంతో  ఆనందంగా ఆస్వాదిస్తూ పండుగలను స్వాగతించడానికి, మనం స్వర్గసీమగా భావించే ఇంటికి సరికొత్త హంగులద్దాలని కోరుకునే సీజన్‌ ఇది. ఓ ఇంటిని అందమైన గృహంగా మార్చడానికి ఎంతో శ్రమిస్తుంటాం. ఫర్నిచర్‌ను సర్దడం మొదలు, గోడలకు రంగులు వేయడం నుంచి మనసుకు నచ్చిన ఫ్లోరింగ్‌ను ఎంచుకోవడం, ఇంటికి ఉన్న సీలింగ్‌ను అందంగా తీర్చిదిద్దడం వరకూ అన్ని అంశాలూ ఇంటికి కొత్త కళ తీసుకురావడానికి తోడ్పడతాయి. అయితే, చాలామంది  హోమ్‌రెనోవేషన్‌ ప్రాజెక్ట్‌లను సాధ్యమైనంత వరకూ పట్టించుకోరు. ఎందుకంటే అవి అత్యధికంగా సమయం తీసుకోవడంతో పాటుగా అసౌకర్యమూ కలిగిస్తాయి. కానీ సరైన ప్రణాళిక, సృజనాత్మక ఇంటీరియర్‌ డిజైన్‌ ఆలోచనలతో సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే  సమయం కోసం గృహాలను  సమూలంగా మార్చవచ్చు. మీ అవసరాలు, ప్రాధాన్యతలు, బడ్జెట్‌ను అందుకునే రీతిలో ఇంటీరియల్‌ డిజైన్‌ ఉండటం అత్యంత కీలకం.  కానీ ఈ ప్రక్రియలో మీ లివింగ్‌ స్పేస్‌లో అత్యంత కీలకమైన కొన్ని భాగాలను మాత్రం  అసలు మరిచిపోకూడదు. అలాంటి ఓ అత్యంత కీలకమైన అంశం  సీలింగ్‌.


అయితే చాలా సందర్భాలలో సీలింగ్స్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏదైనా ఇంటీరియర్‌ స్పేస్‌ను అలంకరించాలనుకుంటే సాధారణంగా గోడలు, ఫ్లోర్స్‌ మీద అధికంగా శ్రద్ధ చూపుతుంటారు. మీ అభిరుచులకు తగినట్లుగా అంశాలను  మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ, సీలింగ్స్‌ సైతం మీ ఇంటిలోని వాతావరణాన్ని ఆహ్లాదీకరించడంలో అతి కీలకమైన పాత్రను పోషిస్తాయి.  ప్రత్యేకమైన, సున్నితమైన, అద్వితీయ అందం మీ ఇంటికి లభించాలంటే సీలింగ్‌ చక్కటి తోడ్పాటునూ అందిస్తుంది. సీలింగ్‌కు సౌందర్యం అందించేందుకు చాలా మంది డిజైనర్స్ కృత్రిమ సీలింగ్స్‌ను ఎంచుకుంటుంటారు. ఎలాంటి ఇంటీరియర్‌కు అయినా  చూపుల పరంగా గణనీయమైన ప్రభావాన్ని అవి చూపుతాయి. ప్రస్తుతం, బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లు డిజైన్‌ ప్రక్రియ ఆరంభం నుంచి డిజైన్డ్‌ ఫాల్స్‌ సీలింగ్స్‌ వినియోగాన్ని నొక్కి చెబుతున్నారు. 


ఓ ఇంటి యజమానిగా, గణనీయంగా మీ ఇంటీరియర్స్‌కు పునః రూపకల్పన చేయడమన్నది అత్యంత ఖర్చుతో కూడిన అంశంగా కనిపించవచ్చు. అయితే, పని పూర్తిచేయడానికి, మీ ఇంటి సీలింగ్‌ పునః రూపకల్పన చేయడానికి మీ బ్యాంక్‌లో నిల్వ చేసిన నగదును మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. అయితే, మీ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో నమ్మకమైన భాగస్వామి అవసరం ఉంది. సెయింట్‌ గోబైన్‌ జిప్రోక్‌ దీని కోసం మీ భావోద్వేగాలు, బడ్జెట్‌, గడువు తేదీలను అందుకునే రీతిలో సమగ్రమైన క్యాటలాగ్స్‌ను అభివృద్ధి చేసింది. కేవలం ఏడు రోజులలో మీ సీలింగ్‌కు నూతన అందాన్ని అందించనున్నాయి.  జిప్సం సీలింగ్‌ ఖర్చు కేవలం ఒక  అంశం మీద మాత్రమే కాదు నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి, డిజైన్‌ అవకాశాలు, ఇన్‌స్టాలేషన్‌ ఖర్చు, రవాణా, కూలీ ఖర్చులు. ఈ అంశాలన్నీ గుణించిన తరువాత, ఈ ఖర్చు సాధారణంగా చదరపు అడుగుకు 60–100 రూపాయల నడుమ ఉంటుందని భావించవచ్చు.  అయితే, ఇదంతా కూడా మీరు సంప్రదించిన ఇంటీరియర్‌ డిజైనర్లపై ఆధారపడి ఉంటుంది. మీ లివింగ్‌ స్పేస్‌కు సంబంధించి అత్యుత్తమ డిజైన్‌ ఎంచుకునేందుకు తగిన మార్గనిర్దేశకత్వం కూడా జిప్రోక్‌ చేస్తుంది. ఇదంతా కూడా సహేతుకమైన, అందుబాటు ధరలలోనే అందిస్తుంది. 


జిప్సం బోర్డులను వినియోగించి సీలింగ్స్‌ డిజైనింగ్‌ దగ్గరకు వచ్చేసరికి, మీకు ఎంచుకునేందుకు ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మీ సీలింగ్స్‌ కోసం విభిన్న ఆకృతులతో మీరు ప్రయోగాలు చేయడం మాత్రమే కాదు, మీ లివింగ్‌ స్పేస్‌కు ఆహ్లాదవాతావరణాన్ని జోడించవచ్చు. ఆకర్షణీయమైన ఫినీష్‌ను అందించడం ద్వారా మీ ప్రోపర్టీ అందం ఇది మెరుగుపరుస్తుంది. డిజైనర్‌ సీలింగ్స్‌తో సౌందర్యం మెరుగుపడటమే కాదు, పలు ప్రయోజనాలు సైతం ఇవి అందిస్తాయి. మీరు ఎయిర్‌ కండీషనర్‌ వినియోగించే అవసరాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా వేసవిలో విద్యుత్‌బిల్లులను కూడా తగ్గిస్తాయి. మీ ఏసీ ఆ ప్రాంతాన్ని కూడా చల్లబరచవలసి వస్తుంది. ఈ వ్యాపారంలో సుప్రసిద్ధమైనది జిప్రోక్‌. ఇది వాల్‌ డెకార్‌, ఫాల్స్‌ సీలింగ్స్‌కోసం విస్తృతశ్రేణిలో అవకాశాలను అందిస్తుంది. ఈ ఫాల్స్‌ సీలింగ్స్‌ అతి తేలికగా ఉండటంతో పాటు, మన్నికైన మెటీరియల్స్‌ అయిన జిప్సం లాంటి వాటితో తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇవి కనీసం రెండు దశాబ్దాల పాటు సాధారణ వినియోగానికి అనుకూలంగా ఉండటంతో పాటు, సులభంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవడమూ ఈజీ అంతే కాకుండా వెరైటీ డిజైన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇంటిని సరికొత్తగా మలచాలంటే ఇలా చేయండి!


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.