లారాను దాటిన హోల్డర్
ABN , First Publish Date - 2020-07-14T08:58:02+05:30 IST
ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించడంతో విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక టెస్టు విజయాలు సాధించిన...
సౌథాంప్టన్: ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించడంతో విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక టెస్టు విజయాలు సాధించిన విండీస్ కెప్టెన్ల జాబితాలో మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా (10)ను అధిగమిస్తూ జేసన్ జట్టుకు 11వ విజయాన్నిందించాడు. ఈ క్రమంలో తను రిచీ రిచర్డ్‌సన్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. అయితే రిచర్డ్సన్ 24 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించగా హోల్డర్ 33 టెస్టులు తీసుకున్నాడు. ఓవరాల్‌గా క్లైవ్ లాయిడ్ 36 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా వివ్ రిచర్డ్స్ (27) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 70, 80వ దశకాల్లో విండీస్ జట్టు తిరుగులేని స్థాయిలో ప్రపంచ క్రికెట్‌ను శాసించింది. ఈనేపథ్యంలో 15 ఏళ్లపాటు వరుసగా 29 టెస్టు సిరీ్‌సల్లో ఓటమి లేకుండా ముందుకు సాగింది.