Abn logo
May 23 2020 @ 21:20PM

హిందూ మతాన్ని నాశనం చేస్తోంది: కన్నా

అమరావతి: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో హిందూ మతాన్ని నాశనం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. హిందూ దేవాలయాలను నాశనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం.. హిందూ వ్యతిరేక చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. టీటీడీ ఆస్తుల అమ్మకాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. ఇదే విషయంపై సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. టీటీడీ ఆస్తుల అమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఆస్తులను విక్రయించే చర్యను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. దేవాలయాలు దివాళా తీయకుండా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలన్నారు. హిందువులను అవమానించడం, బాధపెట్టడం వంటి చర్యలకు పాల్పడవద్దని సీఎంకు కన్నా హితవుచెప్పారు.

Advertisement
Advertisement
Advertisement