న్యూఢిల్లీ: దేశంలోని అగ్రగామి వెల్‌నెస్ బ్రాండ్లలో ఒకటైన హిమాలయ వెల్‌నెస్ కంపెనీ (Himalaya Wellness Company) వినియోగదారుల ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తూ ఓ సరికొత్త ఈక్విటీ క్యాంపెయిన్ ప్రారంభించింది. 9 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వినియోగదారుల మనసులు గెలుచుకున్న హిమాలయ.. ఆరోగ్యం, జీవనశైలిలో మార్పు, ఆరోగ్యం సంరక్షణపై మరింత శ్రద్ధ పెంచడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించింది.
ఈ సందర్భంగా హిమాలయ వినియోగదారుల ఉత్పత్తుల విభాగం బిజినెస్ డైరెక్టర్ రాజేశ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించడంపై వెల్‌నెస్ పాత్రపై అవగాహన కల్పించాలనే నిబద్ధతను ఈ క్యాంపెయిన్ పునరుద్ఘాటిస్తుందని అన్నారు. తల నుంచి పాదాల వరకు వినియోగించే అత్యుత్తమ శ్రేణి ఉత్పత్తులను హిమాలయ అభివృద్ధి చేసిందన్నారు. ప్రెసిడెంట్, ఆఫీస్ హెడ్ (ఎఫ్‌సీబీ బెంగళూరు) ఎం.దామోదరన్ నాయర్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా అందరం ఏదో ఒక రూపంలో ఆరోగ్యం, శ్రేయస్సు ప్రాముఖ్యతను గ్రహిస్తూనే ఉన్నామన్నారు.
90 సంవత్సరాల పాటు శ్రేయస్సుకు మార్గదర్శకత్వం వహించి, తన వారసత్వాన్ని నిర్మించిన హిమాలయా వంటి బ్రాండుకు మన దైనందిన జీవితాలలో శ్రేయస్సు పాత్రను పునరుద్ఘాటించడానికి ఇదే సరైన సమయమని అన్నారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యము’ అనే సామెత ఎంతవరకూ నిజం అయిందో తెలియదు కానీ, హిమాలయా మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, ‘శ్రేయస్సు అనేది నిజమైన సంతోషం’ అని చెప్పగలుగుతోందన్నారు. ఎఫ్‌సీబీ బెంగళూరు ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ హెడ్ రోమిత్ నాయర్ మాట్లాడుతూ.. చురుకైన జీవనశైలి పట్ల ఉన్న డిమాండ్లతో సంతోషం, శ్రేయస్సు కోసం నివారక ఆరోగ్య సంరక్షణను అలవరచుకోవాల్సిన ప్రాముఖ్యతను వినియోగదారులు గ్రహించారని అన్నారు.
ఇవి కూడా చదవండి