ఆన్‌లైన్‌, దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు: పాపిరెడ్డి

ABN , First Publish Date - 2020-08-07T01:24:49+05:30 IST

ఆన్‌లైన్‌, దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు నేర్పించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. విద్యాసంవత్సరం పాలసీపై సీఎం

ఆన్‌లైన్‌, దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు: పాపిరెడ్డి

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌, దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు నేర్పించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. విద్యాసంవత్సరం పాలసీపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారని చెప్పారు. విద్యాబోధన కోసం ఒకట్రెండు ఛానల్స్‌ను హైర్‌ చేసుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఎంట్రెన్స్‌, పరీక్షలపై హైకోర్టులో పిల్‌ ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-07T01:24:49+05:30 IST