Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళా కోర్టులతో సత్వర న్యాయం: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

విజయనగరం: పోస్కో, మహిళా కోర్టుల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుప్ కుమార్ గోస్వామి పేర్కొన్నారు. విజయనగరంలోని జిల్లా కోర్టుని ప్రధాన న్యాయమూర్తి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ హై‌కోర్టు‌కి ఛీప్ జస్టిస్‌గా రావటం తనకు సంతోషంగా ఉందని జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి అన్నారు.


దాదాపు ముప్పై, నలభై సంవత్సరాలుగా ఛీప్ జస్టిస్‌లు ఎవరూ కూడా విజయనగరం కోర్టును సందర్శించలేదని బార్ అసోషియేషన్ తెలిపిందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇపుడు తాను ఈ కోర్టును సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఇదే నా తొలి పర్యటన అని ప్రధాన న్యాయమూర్తి  తెలిపారు. 

సమాజంలో రోజురోజుకీ మహిళలు, పిల్లలపై అసభ్యకరమైన నేరాలు అధికమవుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేరాలను తగ్గించడానికి అందరం కలిసి సమాలోచన చేయాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. పోస్కో, మహిళా కోర్టుల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని ప్రధాన న్యాయమూర్తి  అరుప్ కుమార్ గోస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement