అమరావతి: జస్టిస్ కనగరాజు నియామకాన్ని ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ కనగరాజు నియామకాన్ని.. న్యాయవాది పారా కిషోర్ హైకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారని హైకోర్టు సస్పెండ్ చేసింది. కనగరాజు నియామకం చెల్లదని న్యాయస్థానం ప్రాథమికంగా అభిప్రాయపడింది. పిటిషనర్ తరపు వాదనలు న్యాయవాది ఇంద్రనీల్ బాబు వినిపించారు. ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ కనగరాజు ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.