చంద్రబాబు కేసుపై హైకోర్టు ‘స్టే’ ఇవ్వడం శుభపరిణామం: రఘురామ

ABN , First Publish Date - 2021-03-20T00:25:27+05:30 IST

రాజధాని అసైన్డ్‌ భూముల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై హైకోర్టు స్టే ఇవ్వడం శుభపరిణామమని ఎంపీ రఘురామకృష్ణరాజు స్వాగతించారు.

చంద్రబాబు కేసుపై హైకోర్టు ‘స్టే’ ఇవ్వడం శుభపరిణామం: రఘురామ

ఢిల్లీ: రాజధాని అసైన్డ్‌ భూముల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై హైకోర్టు స్టే ఇవ్వడం శుభపరిణామమని ఎంపీ రఘురామకృష్ణరాజు స్వాగతించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏం చేసినా చెల్లుతుందన్న తమ పార్టీ అభిప్రాయాన్ని ఇకనైనా మార్చుకోవాలని రఘురామకృష్ణరాజు సూచించారు.


చంద్రబాబు, మాజీమంత్రి నారాయణ సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సీఐడీ కేసు విచారణపై న్యాయస్థానం 4 వారాలు స్టే విధించింది. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని కోర్టు కోరింది. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని, పూర్తి స్థాయి విచారణకు అనుమతించాలని హైకోర్టును సీఐడీ అధికారులు  కోరారు. ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో చంద్రబాబు, నారాయణకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా? అని హైకోర్టు ప్రశ్నించింది.

Updated Date - 2021-03-20T00:25:27+05:30 IST