Abn logo
Aug 2 2020 @ 03:20AM

ఎథఫన్‌ వాడకంపై వివరణ ఇవ్వాలి: హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పండ్లను కృత్రిమంగా పండించేందుకు ఎథిలీన్‌ గ్యాస్‌ విడుదల చేసే ‘ఎథఫన్‌’ పౌడర్‌ వినియోగించడం సరైనదో కాదో చెప్పాల్సిందిగా భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ(ఎ్‌ఫఎ్‌సఎ్‌సఏఐ)ను హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.  పండ్లను మగ్గించడానికి కాల్షియం కార్బైడ్‌ వినియోగం ప్రమాదకరమని అమికస్‌ క్యూరీగా వ్యవహరిస్తున్న న్యాయవాది ఎస్‌. నిరంజన్‌రెడ్డి తొలుత కోర్టుకు తెలిపారు. ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ అనుమతించిన ‘ఎథఫన్‌’ పౌడర్‌ వాడుతున్న తమపై కేసులు పెట్టడాన్ని ప్రశ్నిస్తూ రెండు సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. 

Advertisement
Advertisement
Advertisement