ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష ఖరారు
ABN , First Publish Date - 2020-12-31T22:46:13+05:30 IST
కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు రామకృష్ణాచార్యులు కోర్టులోనే ..
అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు బాలకృష్ణమాచార్యులు కోర్టులోనే కూర్చోవాలని ఆదేశించింది. అంతేకాకుండా వెయ్యి రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయకుండా అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు కోర్టు తీర్పు ఇచ్చింది.