Abn logo
Mar 19 2021 @ 11:25AM

రేష్మ-షబీర్‌ల కొడుకును కాపాడాల్సింది మీరే...

"నా ప్రపంచం ఆగిపోయింది. నా కొడుకును చూస్తూ నా కాలమంతా NICU బయట నిరీక్షణలోనే గడిపేశాను. ఏమీ తినాలని అనిపించడం లేదు. ఆరోగ్యం క్షీణిస్తున్న నా పసిపాపడి గురించి ఆందోళనతో నాకు నిద్ర కూడా రావడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ వాడి పరిస్థితి దిగజారిపోతూనే ఉంది. నిస్సహాయురాలినైన నేను భయంతో భీతిల్లిపోతున్నాను. ఇలా జరుగుతుందని ఏ మాత్రం అనుకోలేదు" జలజలా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ చెబుతోంది తల్లి రేష్మ.

రేష్మ, షబీర్ జంటకు కొన్నేళ్ళ కిందటే పెళ్ళయింది. 2020లో ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారినప్పుడు రేష్మ గర్భవతి అయ్యింది. పుట్టబోయే చిన్నారి కోసం రేష్మ తన శక్తి మేరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది కానీ, పరిస్థితులు ఊహించినట్టుగా లేవు.


రేష్మ 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఒక రోజు తను బాత్రూంలో స్పృహ తప్పి పడిపోయింది. షబీర్ వెంటనే తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. రేష్మకు వెంటనే పురుడు పోసి కడుపులో ఉన్న చిన్నారిని బయటకు తీయాలని డాక్టర్లు చెప్పారు.


రేష్మ-షబీర్‌ల పసివాడు నెలలు నిండకముందే ఈ లోకంలోకి వచ్చాడు. ఫలితంగా, ఆ చిన్నారికి అవయవాలు పూర్తిగా రూపొందలేదు. ఈ పరిస్థితి ఎన్నో సమస్యలకు కారణమైంది.

పిల్లవాడు తక్కువ బరువు, సక్రమంగా శ్వాస తీసుకోలేకపోతున్నాడు. మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. రక్తం ఇన్ఫెక్షన్‌కి గురై septicemiaకి దారి తీసింది. ఆ పసి ప్రాణాన్ని ప్రత్యేక పర్యవేక్షణలో అత్యవసర చికిత్స కోసం వెంటనే NICUకి తరలించారు.


డాక్టర్లు ఆ పసివాడి ఆరోగ్యాన్ని పూర్తిగా పరీక్షించి ఇలా చెప్పారు...


"బాబు నెలలు నిండక ముందే పుట్టినందువల్ల అతని శరీరంలోని కీలకమైన జీవక్రియలు వాటంతట అవి స్వయంగా జరిగే స్థితి లేదు. పిల్లవాడిని NICUలో ఉంచి పర్యవేక్షించాలి. ఆ చిన్నారి శరీరంలోని జీవక్రియలు వాటంతట అవి పూర్తి స్థాయిలో ఆరోగ్యకరంగా జరుగుతున్నట్లు మేం గుర్తించే వరకూ తగిన సంరక్షణ ఇవ్వగలం. ఒక నెల రోజుల పాటైనా బాబును NICUలో ఉంచితే తగిన రీతిలో ఆరోగ్యం సమకూరవచ్చు" అన్నారు.


విరాళాలు ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


డాక్టర్లు చెప్పింది విని రేష్మ, షబీర్‌లు రోదిస్తూనే ఉన్నారు. వారి గుండె ముక్కలైపోయినట్లు ఆవేదనలో మునిగిపోయారు.


మా అబ్బాయి ప్రమాదంలో ఉన్నాడని మాకు తెలుసు. అయితే, మా అర్థిక పరిస్థితి వల్ల నిస్సహాయ స్థితిలో ఉన్నాం. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చేయించిన పరీక్షలు, ప్రసవం కోసం అప్పుచేసి ఖర్చుపెట్టాం. మా బాబును కాపాడుకోవడానికి అవసరమైన డబ్బు ఇప్పుడు లేదంటూ వేదన చెందాడు షబీర్.


రోజువారీ కూలిపని చేసుకుంటూ బతుకుతున్న రేష్మ-షబీర్‌ దంపతులకు లాక్‌డౌన్ పరిస్థితులు మరింత కఠినంగా మారాయి. జీవనం గడిపేందుకు అవసరమైన ఆదాయాన్నిచ్చే పని కూడా దొరకలేదు. ఒక వేళ వారికి పని దొరికినా.... నెలకు వారు సంపాదించేది కేవలం రూ.8000 మాత్రమే.

రేష్మ-షబీర్‌లకు కుటుంబ పరంగా ఏ విధమైన సహాయమూ అందే పరిస్థితి లేదు. డబ్బు కోసం అప్పు చేద్దామనుకున్నా తాకట్టు పెట్టడానికి వారి వద్ద విలువైన వస్తువులేమీ లేవు. వాళ్ళ చిన్నారి బాబుకు చికిత్స కోసం సుమారు రూ.7 లక్షలు (9644.80) ఖర్చవుతుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇంత మొత్తం సమకూర్చుకోవడం వారి వల్ల అయ్యే పని కాదు.


విరాళాలు ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


ఇప్పుడు పాపం ఆ తల్లిదండ్రులు ప్రతి రోజూ తమ పిల్లవాడిను చూసుకుంటూ... దైవాన్ని ప్రార్థిస్తూ... ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.


ఈ కష్టకాలంలో రేష్మ-షబీర్‌ల కొడుకును కాపాడే ఆ అద్భుతాన్ని మీరు మాత్రమే చెయ్యగలరు. మీ వల్ల ఎంత సాధ్యమైతే అంత మొత్తాన్ని పెద్ద మనసుతో విరాళంగా అందజేసి ఆ పసిప్రాణం బోసి నవ్వులతో కళకళలాడేలా చెయ్యండి. ఊహించడానికి సైతం ఇష్టపడని సంఘటన ఏదైనా జరిగితే ఆ తల్లిదండ్రులు ఎప్పటికీ తమను తాము క్షమించుకోలేరు. అలా జరగకుండా మీరు మాత్రమే ఆపగలరు.

Advertisement