ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ వారికోసం హెల్ప్ లైన్ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-02-25T21:51:28+05:30 IST

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్ధులు, ఉక్రెయిన్ కు వలస వెళ్లిన వారిని దేశానికి రప్పించేందుకు, అక్కడ ఉన్న వారికి సాయం అందించేందుకు తెలంగాదణ ప్రభుత్వం హెల్ప్ లైన్

ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ వారికోసం హెల్ప్ లైన్ ఏర్పాటు

హైదరాబాద్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్ధులు, ఉక్రెయిన్ కు వలస వెళ్లిన వారిని దేశానికి రప్పించేందుకు, అక్కడ ఉన్న వారికి సాయం అందించేందుకు తెలంగాదణ ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటుచేసింది. దీనికి సంబంధించి శుక్రవారం తెలంగాణ ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోనూ, హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎవరైనా సాయం కోసం ప్రభుత్వం తెలిసిన హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. 


ఢిల్లీలోని తెలంగాణ భవన్ అయితే విక్రమ్ సింగ్ మాన్ +91 7042566955, పీఆర్వో చక్రవర్తి +91 9949351270, ఓఎస్డీ నితిన్ +91 9654663661,  తెలంగాణ సెక్రటేరియట్ కు సంబంధించి ఎఎస్ఓ ఈ.చిట్టిబాబు 040 23220603, +91 9440854433 నెంబర్లకు సంప్రదించాలి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయంతో ఉంటూ విద్యార్ధులు, వలస వెళ్లిన వారికి సాయం చేయాలని సీఎస్ కోరారు. 

Updated Date - 2022-02-25T21:51:28+05:30 IST