హలం.. అలావా పై..!

ABN , First Publish Date - 2021-02-01T05:53:09+05:30 IST

కొన్నిబక్కచిక్కిన దేహాలు చెట్ల కొమ్మల కారాకులై వేలాడుతున్నాయ్‌ దుడ్డుకర్ర విరిగిన శబ్దంలో నిశ్శబ్దంగా...

హలం.. అలావా పై..!

కొన్నిబక్కచిక్కిన దేహాలు

చెట్ల కొమ్మల కారాకులై వేలాడుతున్నాయ్‌

దుడ్డుకర్ర విరిగిన శబ్దంలో నిశ్శబ్దంగా

ఎర్రటి ముద్దై మిగిలిన అంగీల్లో చలి కాచుకుంటున్నాయ్‌


బురద ముద్దాడిన కాళ్ల మధ్య

నెత్తుటి సెగ వేడిగా ప్రవహిస్తోంది

అన్నంమూటపై జలఫిరంగుల మోత

నివురుగప్పిన నివర్‌ తుఫానై విరుచుకుపడింది


కృత్రిమ కన్నీళ్ళకు,

గుండె కమతం నుంచి ఉబికే

ఉప్పునీరుకు మధ్య తొక్కిసలాట

నేల వాలిన పచ్చని గొంతుకల ఆర్తనాదం

అరదండాల్లో ఇరుక్కుని

అరచేతుల్లో మారిన గీతల పరిహాసం


నివ్వెరపోయిన ఇండియా గేటు

మాస్క్‌ తగిలించుకుంది

సంకెళ్ల సడికి అమరావతి రోడ్డు

నడిఎండకు బెదిరిన పసిపాపై కళ్ళు మూసుకుంది  

ఒంటికన్ను రాక్షసులకు కనిపించని రెండోకన్ను చిత్రాలు

ఇంకిన ఇంకులో దిగబడ్డ హలం కదలిక


రాజకీయం పేర్చిన అలావాపై

ఆగని అన్నదాతల మెత్తటి కలల పరుగు

మాలాము రాసుకోవడం తప్ప

మానని గాయం సలుపుతూనే ఉంది.  

కరణం కళ్యాణ్‌ కృష్ణ కుమార్‌

848428978

Updated Date - 2021-02-01T05:53:09+05:30 IST