హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా శంకరయ్యను నియమించింది. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నాగేశ్వర్‌ను , ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా రామకృష్ణారావును బదిలీ చేసింది. మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా రవీందర్సాగర్ను, నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా సత్యనారాయణ రెడ్డిని, గద్వాల్ మున్సిపల్ కమిషనర్‌గా జానకి రామ్సాగర్ను నియమించింది.
షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా జయంత్ కుమార్‌రెడ్డిని, ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్‌గా అమరేందర్‌రెడ్డిని, గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా లావణ్యలను బదిలీ చేసింది. తుర్కంజల్ మున్సిపల్ కమిషనర్‌గా జ్యోతిని, మణికొండ మున్సిపల్ కమిషనర్‌గా ఫల్గున్ కుమార్‌ను, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్‌గా యూసుఫ్‌లను నియమిస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. మేడ్చల్ మున్సిపల్ కమిషనర్‌గా సఫిల్లాను, జవహార్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా జ్యోతిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.