అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల రాయలసీమలో కురిసిన భారీ వర్షాలకు అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పలు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ఈ సంఘటనలు మరువక ముందే తిరిగి రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు.