తెలంగాణకు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2020-06-02T22:54:09+05:30 IST

తెలంగాణలో రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

తెలంగాణకు భారీ వర్ష సూచన

హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. యాదాద్రి, వికారాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల జిల్లాల్లో కూడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Updated Date - 2020-06-02T22:54:09+05:30 IST