హైదరాబాద్‌లో మరికొద్ది గంటల్లో భారీవర్షం

ABN , First Publish Date - 2021-10-16T19:54:04+05:30 IST

హైదరాబాద్‌లో మరికొద్ది గంటల్లో భారీవర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

హైదరాబాద్‌లో మరికొద్ది గంటల్లో భారీవర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరికొద్ది గంటల్లో భారీవర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. వచ్చే రెండ్రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌లో భారీ వర్షం పడింది. జంట జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. గేట్లు ఎత్తి వరద నీటిని అధికారులు విడుదల చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసింది.


ఏపీ, తెలంగాణాలతో పాటు పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. శనివారం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో ఒడిశా రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీచేసింది.తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. 

Updated Date - 2021-10-16T19:54:04+05:30 IST